- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే 22 నుంచి జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు..
దిశ, కేయూ క్యాంపస్ : పల్లె మొదలు పట్టణం దాకా ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలో భాగంగా జిల్లాస్థాయి పోటీలను ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడలు, యువజన అధికారి జి.అశోక్ కుమార్ తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజులపాటు జరిగే ఈ క్రీడోత్సవాల్లో జిల్లాలోని అన్నిమండలాల నుండి దాదాపు 1700 మంది హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ పోటీల విజయవంతానికి జిల్లాకలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో కూడిన పలునిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రత్యేకించి భోజన నిర్వహణ, శానిటేషన్, మెడికల్, రిసెప్షన్, ప్రారంభ ముగింపు కార్యక్రమాల నిర్వహణ , సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వీటితో పాటు క్రీడల నిర్వహణ, ఎంపికల కమిటీలో సంబంధిత క్రీడా సంఘాల బాధ్యులు, కోచ్ లు, సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులని భాగస్వాములు చేసినట్లు చెప్పారు. వేసవి నేపథ్యంలో క్రీడాకారులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఆయా తేదీల్లో క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లోపాల్గొనే అన్ని మండలాల క్రీడాకారులు సకాలంలో హాజరయ్యేలా సంబంధిత ఎంపీడీవోలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. పోటీలను వివాదాలకు తావులేకుండా నిర్వహిస్తూ పారదర్శకంగా జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.
వివిధ మండలాల నుండి వచ్చే క్రీడాకారులకు అసౌకర్యానికి గురి కాకుండా సంబంధిత క్రీడా మైదానాన్ని సులువుగా గుర్తించే వీలుగా ప్రధాన ద్వారం వద్ద సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రిసెప్షన్ కమిటీలో తొలుత ఆయా మండలాల కోచ్, మేనేజర్లు ఎంట్రీ ఫారంలు ఆధార్ కార్డుతో సమర్పించాలి. వివరాలు సరిగా ఉంటేనే ఆడేందుకు అనుమతిస్తామని తెలిపారు. ప్రతిరోజు క్రీడలు ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ప్రతీరోజు వారి ప్రోగ్రాంలో భాగంగా మే 22న నిర్వహించే క్రీడలు కబడ్డీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, హ్యాండ్ వాల్, బాస్కెట్ బాల్, హాకీ ఆటలలో ఎంపిక జరుగుతుందని, 23న జరిగే క్రీడలు వాలీబాల్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, ఆర్చరీ, 24న నిర్వహించే క్రీడలు ఖోఖో, ఫుట్ బాల్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్ , టేబుల్ టెన్నిస్ ఉంటాయని తెలిపారు. క్రీడాంశాల వారీగా బాలబాలికల విభాగంలో ప్రత్యేకంగా పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
22న ప్రారంభోత్సవం..
ఈనెల 22న ఉదయం జరిగే ఈ క్రీడోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ జి.సుధారాణి, జిల్లాకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్ పర్సన్ లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, ఇతర క్రీడా సంఘాల బాధ్యులు హాజరుకానునట్లు చెప్పారు.