శిథిలావస్థకు చేరిన ST హాస్టల్.. బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు

by Rajesh |
శిథిలావస్థకు చేరిన ST హాస్టల్.. బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు
X

దిశ, పర్వతగిరి : మండల కేంద్రంలో ఎస్టీ హాస్టల్‌లో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. పై పెచ్చులు ఎప్పుడు ఊడి పడతాయో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 40 సంవత్సరాల క్రితం హాస్టల్ బిల్లింగ్ నిర్మించారు. కాగా, కాలక్రమేణా హాస్టల్ కాస్త 2013 సంవత్సరంలో ఉన్నత పాఠశాలగా మారడంతో బిల్డింగ్‌పైన రేకుల షెడ్డు నిర్మించారు. అప్పటి నుండి వసతి గృహం మరియు క్లాస్ రుములను అదే బిల్డింగ్‌లో కొనసాగిస్తున్నారు. అప్పటి నుండిపైన కట్టిన గోడలకు నిమ్ము రావడంతో కింద ఉన్న బిల్డింగ్ స్లాబు తడిసి పెచ్చులు ఊడటం, గోడలు కూడా తడుస్తున్నాయి.

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో బిల్డింగ్ పాత పడడం వల్ల గోడలు నిమ్ము వస్తుండడంతో కరెంట్ పాస్ కావడం వల్ల గోడలకు ఎర్త్ వస్తోంది. ఫ్యాన్లు ట్యూబ్లైట్లు కాలిపోవడం పిల్లల పుస్తకాలు నాని బట్టలు పచ్చిగా ఉండడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. చిన్నపాటి వర్షానికి కూడా క్లాస్ రూమ్‌లు, వసతి గృహం అదే కనుక తడితో ఈగలు దోమలు ముక్క వాసనతో ఇబ్బందికరంగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు.

నూతన బిల్డింగ్ నిర్మించాలి : విద్యార్థుల తల్లిదండ్రులు

ఎస్టీ హాస్టల్ బిల్డింగ్ నిర్మించి నలబై సంవత్సరాలు అవుతుండటంతో బిల్డింగ్ పాతబడి పెచ్చులు ఉడుతున్నాయి.‌ కరెంట్ బోర్డులు వైరింగ్ సరైన విధానంలో లేవు. చిన్న పిల్లలు కాబట్టి కరెంట్ షాక్ గురించి అవగాహన ఉండదు. పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు..? హాస్టల్ రూములో వేలాడే కరెంట్ వైర్లు ఉన్నాయి. గోడలకు నిమ్ము వచ్చి గోడలకు ఎర్త్ వస్తుంది. కొన్ని బాత్ రూమ్‌లకు డోర్లు లేవు పిల్లలకు తగినంత మందికి బాత్ రూమ్‌లు లేవు కనుక ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే నూతన బిల్డింగ్ నిర్మించాలని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.

Advertisement

Next Story