Additional Collector : ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి

by Kalyani |
Additional Collector : ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
X

దిశ, ఆసిఫాబాద్: జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్ రావులతో కలిసి రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, మైనింగ్, భూగర్భ జలశాఖల అధికారులతో ఇసుక రవాణా పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులతో పాటు పేదల ఇండ్ల నిర్మాణానికి మాత్రమే ఇసుక ఉచితంగా ఇవ్వాలని, జిల్లాలోని 10 మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఇసుక లభ్యం అవుతుందని, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇసుక నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్నారని, ఈ సమయంలో ప్రత్యేక నిఘా పెట్టి, అనుమతి లేని ఇసుక వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ఇందులో పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టాలని సూచించారు. వాగు, డ్యామ్, చెరువులలో 500 మీటర్ల పరిధిలో డంప్ చేసి, పెట్టుకున్న ఇసుకలను స్వాధీనం చేసుకుని బహిరంగ వేలం వేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణలో నిర్లక్ష్యం వద్దని అధికారులను హెచ్చరించారు.

Advertisement

Next Story