- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు పెట్టుబడులు.. రూ.300 కోట్లతో ‘గిగా ఫ్యాక్టరీ’
దిశ, తెలంగాణ బ్యూరో: మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న షూఆల్స్ కొరియన్ కంపెనీ రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో షూఆల్స్ ఛైర్మన్ చెవోంగ్ లీతో కంపెనీ ప్రతినిధులు గురువారం భేటీ అయ్యారు. 750 ఎకరాలు కేటాయిస్తే రూ.300 కోట్లతో అత్యాధునిక షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని షూఆల్స్ ప్రతినిధులు కోరారు. 87 వేల మందికి ఉద్యోగావకాశాలు దక్కే ‘గిగా ఫ్యాక్టరీ’ ప్రతిపాదనను ఆయన ముందు ఉంచారు. అడుగు భాగాన (సోల్స్) మెడికల్ చిప్ ఉండే బూట్లు, పది వేల అడుగులు వేస్తే గంటకు 25 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే షూతో పాటు డయాబెటీస్, ఆర్థరైటిస్ ఉన్న వారికి ఉపశమనం, స్వస్థత కలిగించే పలు రకాల ఉత్పత్తుల తయారీ కోసం 750 ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రతిపాదించారని మంత్రి వెల్లడించారు. షూఆల్స్ అభ్యర్థన అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. భారీ కర్మాగారం నెలకొల్పి ఇక్కడి నుంచే దేశీయ అవసరాలకు, అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్లకు షూ సరఫరా చేస్తారని వివరించారు. బూట్ల తయారీలో జంతువుల చర్మాన్ని వినియోగించడం వల్ల ట్యానరీలు అవసరమవుతాయని, ఇలా యాన్సిల్లరీ పరిశ్రమలతో అనేక మందికి ఉపాధి దొరుకుందని మంత్రి వెల్లడించారు. ప్రపంచ మార్కెట్లకు తెలంగాణా హబ్‌గా మారుతుందన్నారు.
5వేల ఎకరాలు కేటాయిస్తే స్మార్ట్ హెల్త్ సిటీ...
అమెరికాలోని జాన్ హాప్కిన్స్ లాంటి ప్రఖ్యాత హాస్పిటళ్లను తీసుకురావడంతో పాటు పాటు పరిశోధన కేంద్రాలు, బయో మెడికల్ సెంటర్లు, యాన్సిలరీ పరిశ్రమల కోసం 5,000 ఎకరాలు కేటాయిస్తే ఏషియాలో ఎక్కడా లేని విధంగా స్మార్ట్ హెల్త్ సిటీని నెలకొల్పే ప్రతిపాదన కూడా కొరియా బృందం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. స్మార్ట్ హెల్త్ సిటీ ఏర్పాటుతో లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని వివిరించిన్టు మంత్రి వెల్లడించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేసే పక్షంలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పినట్టు తెలిపారు. షూఆల్స్ కొరియన్ బృందంలో శ్రీమతి ఇన్హీ లీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇండియా) డాంగ్ యివోప్ కిమ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జేహెన్ పార్క్ లు ఉన్నారు.