సోషల్ మీడియా సమన్వయకర్తలదే ముఖ్య పాత్ర

by Kalyani |
సోషల్ మీడియా సమన్వయకర్తలదే ముఖ్య పాత్ర
X

దిశ,వనపర్తి : కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం సోషల్ మీడియా సమన్వయకర్తలదే ముఖ్య పాత్ర ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సోషియల్ మీడియా జాతీయ చైర్ పర్సన్ సుప్రియ శ్రీనేట్ అన్నారు. గురువారం హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి తెలంగాణ రాష్ట్ర సోసియల్ మీడియా సమావేశానికి సోషియల్ మీడియా జాతీయ చైర్ పర్సన్ సుప్రియ శ్రీనేట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫేస్ బుక్, ఎక్స్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషియల్ మీడియా మధ్యమాల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పథకాలను,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయడం తో పాటు ప్రతిపక్షాల ద్వారా కలిగిన, కలుగుతున్న కష్టాలను, నష్టాలను వివరించాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన,చేపడుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సోసియల్ మీడియా సమన్వయకర్తలు చేరా వేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల,జిల్లా సోసియల్ మీడియా సమన్వయకర్తలు ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు,ఆరోగ్య శ్రీ పథకం కు వర్తింపజేస్తామని వెల్లడించారు. చురుకుగా పనిచేసే సోసియల్ మీడియా సమన్వయకర్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్థాయి లో బోనస్ కూడా ఇస్తామన్నారు. సమావేశం అనంతరం తెలంగాణ రాష్ట్ర టెలీకమ్యూనికేషన్ చైర్మన్ మన్నే సతీష్ కుమార్,రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ పెట్టేం నవీన్ లను వనపర్తి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎం.దేవన్న యాదవ్, వనపర్తి అసెంబ్లీ కోఆర్డినేటర్ ధ్యారా పోగు వెంకటేష్,పెద్దమందడి మండల కోఆర్డినేటర్ రాజు, రేవల్లి మండల కోఆర్డినేటర్ రామచందర్ గోపాల్పేట మండల కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

Next Story

Most Viewed