జిల్లాలో మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయాలి : కలెక్టర్ శశాంక

by Aamani |
జిల్లాలో మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయాలి : కలెక్టర్ శశాంక
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: జిల్లాలోని గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ఎంపీడీఓలు నాంది పలకాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. గువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శశాంక మండల అభివృద్ధి అధికారులతో వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు, కమ్యూనిటీ శానిటరీ సముదాయాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, గ్రేవాటర్ మేనేజ్ మెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా కడుతున్న ఇండ్లకు ఐహెచ్హెచ్ఎల్ఎస్ మంజూరు ద్వారా అన్ని అర్హత కలిగిన హౌస్ హోల్డ్‌లకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏదైన స్కీమ్ ద్వారా ఇంతక ముందే మంజూరు చేసి ఉంటే అలాంటి అబ్ధిదారులకు ఐహెచ్హెచ్ఎల్ఎస్ మంజూరు చేయరాదని తెలిపారు.

వ్యక్తిగత గృహ మరుగుదొడ్డి ఉపయోగంలో ఉండాలని, అదే విధంగా వాటిని ఉపయోగించుకునేలా చూడాలని తెలిపారు. సింగిల్ పిట్ టాయిలెట్లను ట్విన్ పిట్ టాయిలెట్లుగా మార్చాలన్నారు. అన్ని సెప్టిక్ ట్యాంక్ టాయిలెట్లు సమీపంలోని ఎఫ్ఎస్‌టిపి కి అనుసంధానం చేసి సురక్షితమైన వాతావరణం అందుబాటులోకి తీసుకు రావాలని తెలిపారు. గ్రామంలోని ఎటువంటి బహిరంగ విసర్జన చేయకుండా ఉండటానికి బహిరంగ విసర్జన రహిత గ్రామాన్ని తీర్చిదిద్దాలని, వాటికి పూర్తి బాధ్యత మండల అభివృద్ధి అధికారులే చొరవ చూపాలన్నారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు కట్టడానికి మండలంలో, రెసిడెన్సీషయల్ స్కూల్, టూరిస్టు ప్రాంతాల్లో, బస్టాండ్ లో, దేవాలయాల దగ్గర,ఆసుపత్రి ఆవరణలో, మార్కెట్ పరిసర ప్రాంతాలో జనసంద్రం ఎక్కువగా ఉన్న చోట కట్టే విధంగా ఏర్పాటు చేయాలని తెలిపారు.

అంతే కాకుండా షాప్, బాతింగ్, బేబి ఫీడింగ్ వంటి అవసరాలను కూడా కమ్యూనిటీ సర్వీసెస్ సెల్ అందుబాటులోకి తీసుకురావచ్చని తెలిపారు. ఇట్టి అవకాశాలను అన్ని విధాలుగా వినియోగించుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ జిల్లా పరిధిలో 2 యూనిట్లను లేదా ఇంకా ఎక్కువ అయిన ఏర్పాటు చేసుకోని మండలాల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను యూనిటికి పంపించి వాటిని క్లీనింగ్ చేయాడానికి, ముక్కలు చేయడానికి సరైన మెషినరీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రే వాటర్ మేనేజ్మెంట్ లో భాగంగా అన్ని గ్రామాల్లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో నీరు నిల్వ ఉండకుండా చూస్తూ, నీరు ప్రవహించే గ్రామాలను గుర్తించి వాటి పైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కమ్యూనిటీ సోక్‌పిట్‌లను అన్ని ప్రభుత్వ భవనాల్లో నిర్మించాలన్నారు. అంతే కాకుండా ప్రతి గ్రామానికి కనీసంగా కనీసం 5 చొప్పున ఏర్పాటు చేయడానికి సిద్ధం కావాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ కు సంబంధించి కొత్త గ్రామ లన్నింటిలో శెగ్రిగేషన్ షెడ్లు నిర్మించాలని, సాధ్యమైన చోట ఘన వ్యర్థాల నిర్వహణ షెడ్లను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని గృహాల నుండి పొడి చెత్త, తడి చెత్త వేరు చేయబడిన వ్యర్థాలను సేకరించేలా ప్రత్యేక చర్యలు చేపడుతూ శెగ్రిగేషన్ షెడ్లను వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు.

వనమహోత్సవంలో భాగంగా ఇప్పటికే నాటిన అవెన్యూ, బ్లాక్ మొక్కలను సంరక్షించుకోవడానికి సరిపడినంత నీరు అందించే విధంగా వాటర్ ట్యాంకులను అందుబాటులోకి తీసుకొని, ప్రతి మొక్కను కాపాడే దిశగా కార్యాచరణ చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో 3 నుంచి 5 గ్రామాలను అధికారులు ఎంపిక చేసుకుని ప్రత్యేక శ్రద్ధ, దత్తత వంటి చర్యలు చేపడుతూ గ్రామాలను మోడల్ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ మోడల్ గ్రామ పంచాయతీ లను తయారు చేయడానికి ముందుగా మండల అభివృద్ధి అధికారులు ముందడుగు వేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, డిఆర్డిఓ శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, సీపీఓ సౌమ్య , మండల అభివృద్ధి అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story