బాణాసంచా దుకాణాలకు జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు

by M.Rajitha |
బాణాసంచా దుకాణాలకు జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లో బాణాసంచా(Firecrakers) విక్రయించే దుకాణాలకు జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ ఇలంబర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. బాణాసంచా విక్రయించే దుకాణాదారులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. బాణాసంచా షాపులను ఫుట్ పాత్ లు, జనావశాల మధ్య ఏర్పాటు చేయకూడదని సూచించారు. షాపుల వద్ద ఉపయోగించే విద్యుత్ సంబంధిత పరికరాలు నాణ్యమైనవి మాత్రమే వాడాలని, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే షాప్ ఓనర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ప్రతి దుకాణం వద్ద ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. స్టాల్స్ ఏర్పాటు చేసుకునేవారు రిటైల్ అమ్మకాల స్టాల్ కు రూ.11 వేలు, హోల్ సేల్ అమ్మకాలకు రూ. 66 వేలు చెల్లించి ట్రేడ్ అనుమతితోపాటు, జీహెచ్ఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందాలని తెలిపారు. నిషేధం ఉన్న టపాసులు అమ్మినా, నిబంధనలు ఉల్లంఘించినా ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి.. సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి, న్యాయస్థానాలు జారీ చేసిన ఆదేశాల కచ్చితంగా పాటించాలని కమిషనర్ తెలియజేశారు.

Advertisement

Next Story