శిక్షణ సద్వినియోగ పరచుకోవాలి : సిద్దిపేట కలెక్టర్

by Aamani |
శిక్షణ సద్వినియోగ పరచుకోవాలి : సిద్దిపేట కలెక్టర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సద్వినియోగ పరచుకుని ఉపాధి పొందాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... నిరుద్యోగులు వారి కాళ్లపై వారు నిలబడేలా శిక్షకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ రంగంలో డైరీ, మష్రూమ్ ఫార్మింగ్ ఆటో మొబైల్ టైలరింగ్ తదితర రంగాల్లో ఎక్కువ మంది శిక్షణ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ సెట్ స్టేట్ కంట్రోలర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అదే విధంగా సిద్దిపేట అర్బన్ మండలం మెట్టపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల జూనియర్ కళాశాలను కలెక్టర్ మను చౌదరి క్షేత్ర స్థాయిలో సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కళాశాల బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. వంట సామాగ్రి స్టోర్ చేసే గదిలోకి వెళ్లి బియ్యం, పప్పులు, ఉప్పు, నూనె కూరగాయలు ప్రతీదీ పరిశీలించారు. క్వాలిటీ తో కూడిన వస్తువులు మాత్రమే ఉపయోగించాలని హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్ ను ఆదేశించారు. కలెక్టర్ వెంట అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story