బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి

by Sridhar Babu |
బైక్ పైనుంచి పడి  వ్యక్తి మృతి
X

దిశ, ఎర్రుపాలెం : మండల పరిధిలోని మీనవోలు పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల గ్రామానికి చెందిన వేముల దుర్గారావు (40) మధిర నుంచి బైక్ మీద కంచికచర్ల వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ పై నుండి పడి తీవ్ర గాయాలు అయ్యాయి.

దాంతో అంబులెన్స్ లో మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందాడు. మృతుడి వద్ద రూ.56,400 నగదు ఉండటంతో ఆ మొత్తాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ ఉమాకు అప్పగించినట్లు అంబులెన్స్ పైలెట్​ మణికుమార్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కృష్ణారెడ్డి తెలిపారు. మృతునికి భార్య ,ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.వెంకటేష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed