Anushka Shetty: ప్రభాస్‌ అలా ఉంటాడంటూ అనుష్క శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. హాట్ టాపిక్‌గా మారిన వీడియో

by Hamsa |
Anushka Shetty: ప్రభాస్‌ అలా ఉంటాడంటూ అనుష్క శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. హాట్ టాపిక్‌గా మారిన వీడియో
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), అనుష్క (Anushka Shetty)గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారంటూ పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై వీరిద్దరు స్పందించి క్లారిటీ ఇచ్చినప్పటికీ పుకార్లు ఆగడం లేదు. దానికి కారణం డార్లింగ్, అనుష్క మిర్చీ, బాహుబలి(Baahubali) వంటి చిత్రాల్లో నటించి కెమిస్ట్రీని పండించారు. దీంతో వీరిద్దరు రిలేషన్ ఉన్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, అనుష్కకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అనుష్క శెట్టి రానా, ప్రభాస్ ఇద్దరిలో ఎవరు సెక్సీగా ఉంటారు అని యాంకర్ అడగ్గా.. ప్రభాస్ పేరు చెప్తుంది. ఇక రానా(Rana Daggubati) నన్ను బ్రో అని పిలుస్తాడు కాబట్టి నేను కూడా అలాగే అంటాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి వార్తలవేళ అనుష్క అలా చెప్పడంతో నెట్టింట పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed