- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యోగా, ధ్యానంతో మెరుగైన ఆరోగ్యం
దిశ, జగిత్యాల్ టౌన్ : ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయడంతో మానసికంగాను, శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంటూ విధులు సక్రమంగా నిర్వహించగలమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. శనివారం అంతర్జాతీయ మొదటి మెడిటేషన్ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మెడిటేషన్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశ ప్రాచీన వారసత్వం ఇచ్చిన విలువైన కానుక యోగా, ధ్యానం అని, వీటితో మానసికంగానూ శారీరకంగానూ ఆరోగ్యంపై పట్టు సాధించవచ్చు అని అన్నారు.
అలాగే శాంతి భద్రతల దృష్ట్యా అధికారులు నిత్యం బిజీగా ఉంటూ ఆరోగ్యంను పట్టించుకోకపోవడంతో ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, నిత్యం మెడిటేషన్ చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పై పట్టు సాధించవచ్చన్నారు. అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ అరగంట పాటు యోగా చేయడం వల్ల ఆనందకరమైన జీవితం పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులతో కలిసి ఎస్పీ, అధికారులు, సిబ్బంది యోగా, ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, రాములు, సీఐ శ్రీనివాస్, రామ్ నరసింహారెడ్డి, ఆరిఫ్ అలీ ఖాన్, వేణుగోపాల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.