- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలెడ్జ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం
దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో గల ఓ భవనం 5వ ఫ్లోర్ లో గల బార్ అండ్ రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ దట్టంగా వ్యాపించడంతో అక్కడున్న వారు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా కష్టపడ్డారు. బిల్డింగ్ లో ఉన్న రెస్టారెంట్ లోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వచ్చారు. గ్యాస్ సిలిండర్ల పేలుడు ధాటికి పక్కన ఉన్న ఐటీ కంపెనీల అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదం జరిగిన బిల్డింగ్ చుట్టుపక్కల పెద్ద మొత్తంలో ఐటీ కంపెనీలు ఉన్నాయి.
అగ్నిప్రమాదంపై పూర్తి దర్యాప్తు : రంగారెడ్డి డీఎఫ్ ఓ కరిముల్లా ఖాన్
నాలెజ్డ్ సిటీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని రంగారెడ్డి డీఎఫ్ ఓ కరిముల్లా ఖాన్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కష్టపడ్డారని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ జి+5 ఫ్లోర్ లు ఉందని తెలిపారు. బిల్డింగ్ నాలుగో ఫ్లోర్ లో మంటలు చెలరేగాయని. అందులో కిచెన్, బార్ ఉన్నాయని వెల్లడించారు. బ్రంటో స్కై లిఫ్ట్ తో పాటు మొత్తం నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశామన్నారు. గ్యాస్ సిలిండర్లు పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా.. లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. కిచెన్‌లోకి వెళ్లి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. బ్లాస్టింగ్ తీవ్రత వల్ల పక్క బిల్డింగ్ అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయని కరిముల్లా ఖాయం తెలిపారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.