- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవసరమైన అన్ని వసతులు సమకూర్చాలి : బోధన్ ఎమ్మెల్యే
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శనివారం సాయంత్రం బోధన్ శాసనసభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. నూతనంగా నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్), క్రిటికల్ కేర్ యూనిట్ లతో కూడిన భవన సముదాయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ నెల 22న (ఆదివారం) లాంఛనంగా ప్రారంభోత్సవం చేసిన అనంతరం జీజీహెచ్ లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆసుపత్రులు, వైద్యారోగ్య శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్ష జరపనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జీజీహెచ్ ను ముందస్తుగానే శనివారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సూపరింటెండెంట్ ఛాంబర్లో ఆయా విభాగాల అధిపతులతో సమావేశమై వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఒక్కో విభాగం వారీగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంకనూ కొత్తగా సమకూర్చాల్సిన సదుపాయాలు తదితర వాటి గురించి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
వైద్య సేవలను మరింతగా మెరుగుపర్చేందుకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చాల్సిందిగా సంబంధిత మంత్రికి నివేదిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. వివిధ వైద్య సేవల కోసం ప్రతిరోజు సగటున 2000 మంది వరకు రోగులు జీజీహెచ్ కు వస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని విభాగాల పనితీరును మెరుగుపర్చేలా అవసరమైన వైద్యులు, సిబ్బందితో పాటు అధునాతన వైద్య పరికరాలు మంజూరు చేయాల్సిందిగా వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి తెస్తామని తెలిపారు. ఆసుపత్రిని నిర్మించి సుమారు 14 సంవత్సరాల కాల వ్యవధి అవుతున్నందున నిర్వహణ పరమైన లోపాలను కూడా చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. జీజీహెచ్ తో పాటు బోధన్, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొని ఉన్న ఇబ్బందులను అధిగమించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాగా, మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ తదితరులు ఉన్నారు.