చెరకు పంట వేస్తే... షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం : బోధన్ ఎమ్మెల్యే

by Aamani |
చెరకు పంట వేస్తే... షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం : బోధన్ ఎమ్మెల్యే
X

దిశ,నవీపేట్ : రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ చెరుకు పంటను పండిస్తే వచ్చే ఏడాది బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ని ప్రభుత్వం నడిపేందుకు సిద్ధంగా ఉందని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. అన్నదాతలు ఒకే పంట వేయడంతో భూసారం తగ్గుతుందని, రైతులు అలీ సాగర్ సాగు నీటిని, పొదుపుగా వాడి వరికి బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలు పండించాలని రైతులకు సూచించారు. మండలంలోని కోస్లీ గోదావరి వద్ద గల అలీ సాగర్ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ లో మోటార్లను స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. అంతకుముందు శాఖాపూర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ పంట కొరకు రైతులు అడిగిన వెంటనే అలీ సాగర్ నీటిని విడుదల చేస్తున్నామని, నిజాంసాగర్ సాగునీరు రాక ఇబ్బందులు పడిన రైతులను చూసి అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి తో మాట్లాడి అలీ సాగర్ ఎత్తిపోతలు మంజూరు చేయించానని తెలిపారు.

రాష్ట్ర స్థాయి ఇరిగేషన్ అధికారులు శ్రీరాంసాగర్ నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లించేందుకు ప్రయత్నించగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి జిల్లా రైతాంగానికి ఇస్తున్నానని తెలిపారు. రైతులు సాగునీటిని పొదుపుగా ఉపయోగించుకుంటూ రెండవ పంటలో వరికి బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలను వేయాలని తెలిపారు. హార్టికల్చర్ రాయితీని ఉపయోగించుకొని పందిరి పంటలు దొండ, కాకర, బీర లాంటి కూరగాయలను పండించాలని తెలిపారు. పందిరి వేయడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, రైతులు దరఖాస్తు చేసుకొని ఉపయోగించికోవాలని తెలిపారు. గత కేసీఆర్

ప్రభుత్వం నిజాం షుగర్ ను ప్రభుత్వ పరం చేస్తానని హామీ ఇచ్చి నడుస్తున్న ఫ్యాక్టరీని మూతపడేలా చేసిందని కానీ తమ ప్రభుత్వం బ్యాంకర్స్ తో మాట్లాడి ఇప్పటికే 200 కోట్ల రుణాన్ని తీర్చి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలో ఫ్యాక్టరీ ని నడిపిస్తామని హామీ ఇచ్చారు.రైతులు చెరుకు పంట పండించాలని కోరారు. ఈ సంవత్సరం రైతులు చెరుకు పండిస్తే వచ్చే సంవత్సరం బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ , కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story