దిశ ఎఫెక్ట్...ప్రమాదకర ట్రాన్స్ ఫార్మర్ ను పరిశీలించిన అధికారులు

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్...ప్రమాదకర ట్రాన్స్ ఫార్మర్ ను పరిశీలించిన అధికారులు
X

దిశ, తంగళ్లపల్లి : ప్రభుత్వ పాఠశాల వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పై దిశ అందించిన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం.. ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్.. అనే శీర్షకన ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు పాఠశాల వద్ద ట్రాన్స్ ఫార్మర్ ను పరిశీలించారు. అలాగే పాఠశాలను సైతం సందర్శించి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సెస్ ఏఈ మధుకర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story