సీఎంను కలిసిన ఎమ్మెల్యే సామేలు‌.. సమస్యలపై వినతిపత్రం

by Aamani |
సీఎంను కలిసిన  ఎమ్మెల్యే సామేలు‌.. సమస్యలపై వినతిపత్రం
X

దిశ,తుంగతుర్తి: తన అసెంబ్లీ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించాలని కోరుతూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఒక వినతి పత్రాన్ని అందజేశారు.అసంపూర్తి నిర్మాణంలో వున్న తుంగతుర్తిలోని 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలని పేర్కొన్నారు.తిరుమలగిరి మండలానికి దేవాదుల ప్రాజెక్టు నీళ్లను అందించడంతో పాటు మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ అప్ గ్రేడ్ చేస్తూ కాలేజీ గా మార్చాలని,నూతనకల్ మండలం గుండ్ల సింగారం వద్ద తెగి పోయిన బ్రిడ్జిని నిర్మించాలని కోరారు.అంతేకాకుండా ప్రధాన సమస్యలు పరిష్కరించాలని ఆయన సీఎంకు సమర్పించిన వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed