AP Govt:చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. చాగంటికి మరో కీలక బాధ్యత

by Jakkula Mamatha |   ( Updated:2024-12-21 14:06:44.0  )
AP Govt:చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. చాగంటికి మరో కీలక బాధ్యత
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్(AP Government) ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara Rao)కు కేబినెట్ హోదా కలిగిన.. విద్యార్థులు - నైతిక విలువల సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల చాగంటి కోటేశ్వరరావు సీఎం చంద్రబాబు(CM chandrababu), మంత్రి లోకేష్‌(Minister Nara Lokesh)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా చాగంటికి ప్రభుత్వం మరో కీలక బాధ్యత అప్పగించింది.

విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు చాగంటితో ప్రభుత్వం ప్రత్యేకంగా పుస్తకాల(Books)ను తయారు చేయించి, విద్యార్థులకు పంపిణీ చేయనుంది. రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో(Cabinet Meeting) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు చాగంటి తెలిపారు. పిల్లలకు ఉపయోగపడేలా నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం(government) ఇచ్చిన బాధ్యతలను స్వీకరిస్తున్నాను అన్నారు. పదవుల కోసం తాను ఒప్పుకోలేదని.. తన మాటలతో పిల్లలకు మేలు జరిగితే చాలు అని చాగంటి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed