స్టాఫ్ నర్సు పోస్టులకు అర్హులు దరఖాస్తు చేసుకోండి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

by Aamani |
స్టాఫ్ నర్సు పోస్టులకు అర్హులు దరఖాస్తు చేసుకోండి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
X

దిశ,నల్లగొండ: నల్గొండ జిల్లా ,పీఏ పల్లి మండలం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న (2) స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న పీఏ పల్లి మండలం లేదా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన స్థానిక అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని తెలిపారు.అలాగే అభ్యర్థులు జనరల్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలని, 18 పైన 35 సంవత్సరాల లోపు వయసున్న అభ్యర్థులు ఇందుకు అర్హులని,పోస్టుల భర్తీ లో మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి,మండల ప్రత్యేక అధికారి ,ఆర్ డి ఓ, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి కమిటీ ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుందని,ఎంపికైన అభ్యర్థులు ఔట్ సోర్సింగ్ పద్ధతిన నెలకు రూ.19500/- వేతనంతో పనిచేయాల్సి ఉంటుందని , పి ఏ పల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఆవరణలోని క్వార్టర్స్ లొనే నివాసం ఉండాల్సి ఉంటుందని తెలిపారు. పై నిబంధనలకు కట్టుబడి పని చేసేందుకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పై 2 స్టాఫ్ నర్స్ పోస్టులకు ఈ నెల 31 లోగా పి ఏ పల్లి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed