Car Accident : కారుతో ఢీకొట్టి.. 30కిమీ దూరం ఈడ్చుకు వెళ్ళిన డ్రైవర్

by M.Rajitha |
Car Accident : కారుతో ఢీకొట్టి.. 30కిమీ దూరం ఈడ్చుకు వెళ్ళిన డ్రైవర్
X

దిశ, వెబ్ డెస్క్ : కారుతో ఢీకొట్టడమే కాకుండా.. ఆగకుండా 30కిమీల దూరం ఆ వ్యక్తిని ఈడ్చుకు వెళ్ళాడు ఆ డ్రైవర్. యూపీ(UP)లోని పయాగపూర్ గ్రామానికి చెందిన నరేందద్రకుమార్ హాల్దార్ తన బైక్ మీద ఇంటికి తెరిగి వస్తుండగా.. అతి వేగంగా వచ్చిన డిప్యూటి తహశీల్దార్ కారు నరేంద్రకుమార్ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నరేంద్రకుమార్ కారు కింద చిక్కుకుపోగా.. అది గమనించని డ్రైవర్ కారును 30 కిమీల దూరం డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. ఈ ప్రమాదంలో నరేంద్రకుమార్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ భయంతో, తప్పించుకునేందుకు పారిపోవడం వలన ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed