- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijay Hazare Trophy : విజయ హజారే ట్రోఫీలో 35బంతుల్లో అన్మోల్ ప్రీత్ సింగ్ శతకం
దిశ, వెబ్ డెస్క్ : విజయ హజారే (Vijay Hazare Trophy)క్రికెట్ ట్రోఫీలో తొలి రోజునే సంచలనం నమోదైంది. పంజాబ్ బ్యాటర్ అన్మోల్ ప్రీత్ సింగ్(Punjab batter Anmol Preet Singh) 35బంతుల్లోనే శతకం సాధించి సంచలనం రేపాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ(Fastest century) చేసిన భారత ఆటగాడిగా అన్మోల్ ప్రీత్ సింగ్ రికార్డు సృష్టించాడు. అన్మోల్ ప్రీత్ సింగ్ విజృంభణతో అరుణాచల్ ప్రదేశ్ విధించిన 165పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.5ఓవర్లలోనే పంజాబ్ చేధించి విజయం సాధించింది.
ఇటీవలే దేశవాళీ టీ 20 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ముగిసిపోగా, శనివారం నుంచి 50ఓవర్ల ఫార్మట్ లో విజయ హజారే ట్రోఫీ ప్రారంభమైంది. మరో ఎనిమిది వారాల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంకానున్న నేపథ్యంలో విజయ హజారే ట్రోఫీలో రాణించడం ద్వారా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి టీమిండియాకు ఎంపిక కావాలని యువ ఆటగాళ్లు పోటీ పడుతుండటంతో ఈ టోర్నీ మ్యాచ్ లో పోటాపోటీగా ఆసక్తికరంగా సాగుతున్నాయి.