Constitution: రాజ్యాంగం సాక్షిగా ఒక్కటైన జంట.. ఛత్తీస్‌గఢ్‌లో వినూత్న వివాహం

by vinod kumar |
Constitution: రాజ్యాంగం సాక్షిగా ఒక్కటైన జంట.. ఛత్తీస్‌గఢ్‌లో వినూత్న వివాహం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత రాజ్యాంగం (Indian constitution) గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ జంట రాజ్యాంగం సాక్షిగా ఒక్కటయ్యారు. కాన్‌స్టిట్యూషన్‌లోని ప్రవేశికపై ప్రమాణం చేసి వివాహబంధంలోకి ప్రవేశించారు. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని జష్ పూర్ జిల్లా కాపు గ్రామానికి చెందిన యమన్(Yeman), ప్రతిమ లాహ్రే(Prathima laahre) అనే జంట మంగళసూత్రం, నుదుట తిలకం, బ్యాండ్ బాజాలు, ఊరేగింపు, ఏడడుగులు వేయడం వంటివి లేకుండా నిరాడంబరంగా పెళ్లిచేసుకున్నారు. అంతేగాక రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేశారు. వారి చేతుల్లో రాజ్యాంగం కాపీని పట్టుకుని పీఠికను చదివి దంపతులుగా మారారు. వీరి వివాహనికి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

నవంబర్ 18న ఈ వినూత్న వివాహం జరగగగా తాజాగా ఆ వేడుకకు సంబంధించిన పొటోలు సోషల్ మీడియాతో వైరల్‌గా మారాయి. అయితే అనవసరమైన ఖర్చులను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు దంపతులు తెలిపారు. వీరి వివాహం ఎంతో మందికి ఆదర్శమని పలువురు కొనియాడారు. స్థానిక జర్నలిస్టు రమేశ్ మాట్లాడుతూ.. ఈ వివాహం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. ‘రాజ్యాంగం ఒక ప్రేమ పుస్తకం అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తరచూ చెబుతున్న భావనను ఈ జంట ఆచరించింది’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed