SBI Clerk Recruitment: ఎస్‌బీఐలో 13,735 క్లర్క్ పోస్టులు.. అభ్యర్థులకు మరో శుభవార్త..!

by Maddikunta Saikiran |
SBI Clerk Recruitment: ఎస్‌బీఐలో 13,735 క్లర్క్ పోస్టులు.. అభ్యర్థులకు మరో శుభవార్త..!
X

దిశ,వెబ్‌డెస్క్: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆల్ఫ్ ఇండియా(SBI) ఇటీవలే క్లర్క్(Clerk) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 13,735 జూనియర్ అసోసియేట్(JA) పోస్టులను భర్తీ చేస్తున్నామని ముందుగా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఈ నోటిఫికేషన్ లో మరో 609 బ్యాక్ లాగ్(Backlog) పోస్టులను కలిపి భర్తీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఎస్‌బీఐ తాజాగా వెల్లడించింది. అయితే ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ డిసెంబర్ 17న ప్రారంభమైంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 7 జనవరి 2025. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/web/careers/current-openings ద్వారా అప్లై చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్(AP)లో 50, తెలంగాణ(TG)లో 342 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ పూర్తయిన 20 నుంచి 28 ఏళ్ల లోపు వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ. 750 ఫీజు చెల్లించాలి. మిగతా కేటగిరీ వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్(Prelims), మార్చి/ ఏప్రిల్ లో మెయిన్స్(Mains) ఎగ్జామ్ నిర్వహిస్తారు.

Advertisement

Next Story