- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అశ్రునయనాల మధ్య మాజీ ఎమ్మెల్యే మర్రి తండ్రి అంత్యక్రియలు
దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి మర్రి జంగి రెడ్డి (80) అంత్యక్రియలు శనివారం వారి స్వగ్రామం తిమ్మాజీపేట మండలం నేరెళ్ల పల్లి గ్రామంలో అశేష జనం అశ్రునయనాల మధ్య జరిగాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో వైద్య సేవలు పొందుతూ ఉన్న మర్రి జంగి రెడ్డి ఈరోజు తెల్లవారుజామున 12:30 గంటల ప్రాంతంలో దివంగతులు అయ్యారు. ఆయన మృతదేహాన్ని ఉదయం వారి స్వగ్రామానికి తీసుకురాగానే కుటుంబ సభ్యులు, అభిమానుల రోదనలు మిన్నంటాయి. మర్రిని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రేడ్డి, శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ ఎంఎల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, అంజయ్య యాదవ్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, బీజేపీ నాయకులు దిలీపాచారి, తదితరులు మర్రి జనార్దన్ రెడ్డి ని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. జంగి రెడ్డి అంతిమ యాత్ర లో పెద్ద కొడుకైన మర్రి జనార్దన్ రెడ్డి ముందు నడవగా వేలాది మంది నాయకులు, ప్రజల మధ్యన అంతిమ యాత్ర సాగింది. మర్రి సొంత వ్యవసాయ పొలంలో అంత్యక్రియలు జరిగాయి.