- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Face yoga : ఐదు నిమిషాలు చేస్తే చాలు .. మీ ముఖ సౌందర్యం పెరుగుతుంది !
దిశ, ఫీచర్స్ : ముఖ సౌందర్యం పెరగాలంటే కేవలం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే అవసరం అనుకుంటే పొరపాటే.. జీవన శైలిలో మెరుగైన మార్పులు, ఫేస్ యోగా వంటివి కూడా అందుకు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. యోగా వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుందని తద్వారా స్కిన్ గ్లోయింగ్ పెరుగుతుందని చెబుతున్నారు. అయితే మొత్తం చర్మంతోపాటు ముఖ సౌందర్యాన్ని పెంచడంలో కొన్ని యోగాసనాలు అద్భుతంగా సహాయపగాయి. అవేంటో చూద్దాం.
*హలాసనం : థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడంలో ఈ ఆసనం అద్భుతంగా పనిచేస్తుంది. తద్వారా హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగు పడటం కారణంగా స్కిన్ గ్లో పెరుగుతుంది. అయితే ఈ యోగాసనం చేయడానికి బోర్లా పడుకుని, మీ కాళ్లను పైకి లేపాలి. ఆ తర్వాత మీ తలను వెనుకకు తీసుకోండి. దీనివల్ల మీ చర్మానికి, ఆక్సిజన్ సక్రమంగా అందుతుంది. ముఖం కాంతివంతంగా మారుతుంది.
*సింగ్ ఆసనం: ఇది నాలుక బయటకు తీసి సింహంలా గర్జించే ఆసనం. దీనివల్ల ముఖ కండరాలు విస్తరించి రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. రోజూ చేయడంవల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. వృద్ధాప్య ఛాయలు పోయి, యవ్వన ఛాయలు కనిపిస్తాయి.
*భుజంగాసనం : బోర్లా పడుకుని, చేతుల సహాయంతో శరీరాన్ని పైకి లేపాలి. ఇది ముఖంలోని రక్త నాళాలను ఉత్తేజ పరుస్తుంది. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా మారేలా సహాయపడుతుంది.
*ఉత్తనాసనం : నిటారుగా నిలబడి, ముందుకు వంగి మీ చేతులతో నేలను తాకాలి. ఈ ఆసనం ముఖానికి రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది స్కిన్ గ్లోను పెంచుతుంది. డైలీ చేయడంవల్ల ఆరోగ్యానికి చాలామంచిది. దీంతోపాటు తాడాసనం, శవాసనం వంటివి ఆసనాలు కూడా ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.