క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

by Mahesh |
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2024 క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ క్రిస్టియన్ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ శాఖ ఆద్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తారు. కాగా అసెంబ్లీ సమావేశాల ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు క్రిస్టియన్ సంఘాలు.. ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీఎం తో పాటు.. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర శాఖల ముఖ్య అధికారులు పాల్గోన్నారు. ఈ క్రమంలో మంత్రులు, క్రైస్తవ ప్రముఖులతో కలిసి.. క్రిస్మస్ ట్రీని వెలిగించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరుఫున.. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకుల నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మిరాకిల్ మంత్.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో పాటు, కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ అభిమానులకు ఎంతో ముఖ్యమైనదని అన్నారు. అలాగే ఏసు ప్రభువు ఇచ్చిన సందేశం లో అన్ని అంశాలు సంక్షిప్తమై ఉన్నాయని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి.. ప్రభుత్వం తో పోటీ పడి.. దేశానికి విద్యాను, వైద్యాన్ని క్రిస్టియన్ సంస్థలు అందించాయని కొనియాడారు. నేటికి పలు సంస్థలు ప్రభుత్వానికంటే మెరుగ్గా.. సేవలు అందిస్తున్నాయని, తండాలు, అటవీ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ.. ఆరోగ్య తెలంగాణను క్రైస్తవ సంఘాలు కాపాడుతున్నాయని సీఎం రేవంత్ కొనియాడారు. అలాగే దేశంలో సర్వ మతాలకు రక్షణ కల్పించడమే తెలంగాణ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. అన్ని జిల్లాలో అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed