- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కాలిఫోర్నియా కార్చిచ్చుకు కారణాలు ఇవేనా?

దిశ, నేషనల్ బ్యూరో:
అమెరికాలోని కాలిఫోర్నియాలో భీకర నష్టానికి కారణమైన కార్చిచ్చు మొదలవడానికి గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. హాలీవుడ్‌కు కేంద్రమైన లాస్ ఏంజిల్స్ నగరంలో అంటున్న భీకరమైన మండల కారణంగా ఇప్పటికే 16 మంది చనిపోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లాస్ ఏంజెల్స్‌లోని వేలాది కట్టడాలు సర్వనాశనం అయ్యాయి. ఇందలో హాలీవుడ్ నటుల ఇండ్లతో పాటు, బిజినెస్ టైకూన్ల నివాసాలు కూడా ఉన్నాయి. అయితే ఈ కార్చిచ్చు ఎక్కడ? ఎలా మొదలైందనే విషయాలను కనుక్కోవడానికి అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు. పెడ్రా మొరాడా డ్రైవ్‌లోని ఒక ఇంటి వెనుక ఈ మంటలు ప్రారంభమై ఉండొచ్చని ఒక అంచనా వేస్తున్నారు. అయితే అసలు ఆ మంటలు ఎలా రాజుకున్నాయనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ అంచనా మేరకు సాధారణంగా అమెరికాలో కార్చిచ్చులకు పిడుగులు కారణం అవుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో పిడుగులు పడిన దాఖలాలు లేవని తెలుస్తోంది. ఇక కరెంటు తీగల కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చనే మరో అనుమానాన్ని కూడా విచారణ అధికారులు అంచనా వేస్తున్నారు. కార్చిచ్చుకు ముందు ఈ ప్రాంతంలో కరెంటు తీగల వల్ల మంటలు చెలరేగిన ఘటనలు ఉంటే వెంటనే కాలిఫోర్నియా పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్‌కు రిపోర్టు చేయాలని కోరారు. 2017లో చెలరేగిన థామస్ ఫైర్‌కు యుటిలిటీ లైన్స్ కారణమయ్యాయి. అప్పట్లో సదరన్ కాలిఫోర్నియా ఎడిసన్ పవర్ లైన్స్ ఒకదానితో మరొకటి కాంటాక్ట్‌లోకి వచ్చి భారీగా మంటలు చెలరేగాయి. అయితే ప్రస్తుతం అలాంటి సంఘటన జరిగినట్లు ఇంకా తెలియరాలేదు. ఇక 2021లో ఒక జంట జెండర్ రివీల్ స్టంట్ చేసినప్పుడు ఆ టార్చ్ నుంచి వెలువడిన మంటలు దాదాపు 90 చదరపు కిలోమీటర్ల పరిధిలో కార్చిచ్చును రగిలించాయి. అయితే ఇలాంటి ఘటన కూడా ఇప్పుడు ఏమీ నమోదు కాలేదని తెలుస్తుంది. మొత్తానికి ఇన్వెస్టిగేటర్లు అన్ని కోణాల్లో ఈ కార్చిచ్చుకు కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు.