Trump : కెనడా ఎన్నికలపై ట్రంప్ హాట్ కామెంట్స్

by Shamantha N |
Trump : కెనడా ఎన్నికలపై ట్రంప్ హాట్ కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది చివర్లో కెనడా ఎన్నికలు(Canada Elections) జరగనున్నాయి. కాగా.. కెనడా ఎన్నికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా తనకు పట్టింపు లేదని.. లిబరల్స్‌ గెలిచినా తాను పట్టించుకోనని ట్రంప్‌ అన్నారు. లిబరల్స్ ప్రధాన ప్రత్యర్థి, కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పోయిలివ్రేను లక్ష్యంగా చేసుకొని ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. మీ వైఖరి కారణంగానే కెనడాలో లిబరల్‌ పార్టీ (Liberal Party) గెలిచే సూచనలు కన్పిస్తున్నాయని.. ఆ పార్టీ గెలిచిన తర్వాత అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న రిపోర్టర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సంప్రదాయవాదుల కంటే ఉదారవాదులను డీల్‌ చేయడమే మరింత సులభం అని పేర్కొన్నారు. ఏం జరిగినా పన్నుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

లిబరల్స్ దే గెలుపు..

మరోవైపు, 2015 నుంచి కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో ఇటీవలే పదవికి రాజీనామా చేశారు. కెనడా 24వ ప్రధానిగా మార్క్‌ కార్నీ (Mark carney) ఇటీవల ప్రమాణం చేశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో లిబరల్‌ పార్టీని కార్నీనే ముందుండి నడిపించనున్నారు. ఇకపోతే, ఈ ఏడాది చివర్లో జరగనున్న కెనడా ఎన్నికల్లో లిబరల్స్ మళ్లీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సర్వేలు పేర్కొంటున్నాయి. ట్రంప్ తరహాలోనే పొయిలీవ్రేను లిబరల్స్ ఒక మితవాద ప్రజానాయకుడిగా చిత్రీకరించారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇచ్చిన పోయిలీవ్రే ట్రంప్ తరహాలోనే ఆలోచిస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇకపోతే, మార్చి 4 నుంచే అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన కెనడా (Canada), మెక్సికో (Mexico)లపై 25శాతం సుంకాలు (USA Tariffs) వసూలు చేస్తోంది. దీంతో, వాషింగ్టన్ పై కెనడా ప్రతీకార చర్యలకు పూనుకంది. అమెరికా ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించింది. కాగా.. ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం టారీఫ్ లు పెంచుతామని ప్రకటించి.. ఈ పెంపుని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.

Next Story

Most Viewed