- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CM Revanth: పట్టుదలతో ఆ పని చేశా.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, వెబ్‌వెస్క్: అసెంబ్లీ (Assembly)లో ఎస్సీ వర్గీకరణ బిల్లు (SC Classification Bill) అమోదం పొందిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఎస్సీ సంఘాల నాయకులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారంతా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరులైన వారికి సీఎంతో పాటు మంత్రులు (Ministers), ఇతర నేతలు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తరతరాలుగా ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. దేశంలో బీజేపీ (BJP) అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణ జరగలేదని గుర్తు చేశారు.
ఎన్నటికైనా ఎస్సీ (SC) సమాజం తమ ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోవాలనే ఈ జాతికి న్యాయం చేశానని అన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని భరోసానిచ్చారు. ఎన్నో ఏళ్ల చిక్కుముడికి సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు పరిష్కారం చూపించామంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫిషన్లు (Job Notifications) ఇవ్వలేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం విషయంలో తననొక్కడినే కాకుండా.. తమ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని కూడా అభినందించాలని తెలిపారు. ఇప్పటికీ సీఎంగా మీ వాడే ఉన్నడని భావించాలని, ఎస్సీ కులాల సంక్షేమం, అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి మరింత ధైర్యం చెప్పారు.