ప్రేమ పేరుతో మైనర్ బాలికకు వేధింపులు..

by Sumithra |
ప్రేమ పేరుతో మైనర్ బాలికకు వేధింపులు..
X

దిశ, పెగడపల్లి : మైనర్ బాలికను ఓ ప్రబుద్ధుడు ప్రేమ పేరుతో వేధించగా ఆ బాలిక వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎస్సై రవి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రాం భద్రునిపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక మండల కేంద్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది.

కాగా అదే గ్రామానికి చెందిన బాస రాము, గొల్లపల్లి మండలం రంగదాముని పల్లి గ్రామానికి చెందిన మరొక యువకుడు ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా ప్రేమను ఒప్పుకోకపోతే పరువు తీస్తామని బెదిరించడంతో బాలిక ఈ నెల పదిహేనున పురుగుల మందు సేవిచింది. అది గమనించిన బాలిక తల్లి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. కాగా బాలిక చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించిందని, బాలిక తల్లి ఫిర్యాదు మేరకు వేధించిన ఇద్దరు యువకుల మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Next Story

Most Viewed