- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నువ్వు రా.. అంటే నువ్వేరా..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య ట్విట్టర్ వార్

దిశ, వెబ్ డెస్క్: మానకొండురు (Manakonduru) ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvamapalli Sathyanarayana), మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రసమయి బాలకిషన్ (BRS Leader Rasamai Balakishan) ల మధ్య ట్విట్టర్ వేదికగా వార్ (Twitter War) నడుస్తోంది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి, బీఆర్ఎస్ నేత రసమయి ల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలకు సహనం కోల్పోయిన కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం మాజీ ఎమ్మెల్యే ఇళ్లు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో మానకొండురులో హైటెన్షన్ (High Tension) వాతావరణం చోటుచేసుకుంది. దీనిపై మాజీమంత్రి హరీష్ రావు (BRS Leader Harish Rao) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రసమయి బాలకిషన్ ఇంటిపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని, రసమయి భద్రతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
హరీష్ రావు ట్వీట్ పై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందిస్తూ.. మీ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసి, సవాళ్లు విసిరి, దాక్కున్న వైఖరిని మీరు సమర్థిస్తున్నారా హరీష్ రావు? అని ప్రశ్నించారు. అలాగే సవాలు విసిరితే తీసుకోవడం రాజకీయ నాయకుడి ముఖ్య లక్షణం అని, దమ్ముంటే రండి అంటే దాక్కునే వైఖరి మాది కాదని, ఓపిక నశించిన కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యే అనుచిత వ్యాఖ్యలు, అవాస్తవాలను కట్టడి చేయాల్సిన బాధ్యత మీరు తీసుకుంటారా అని నిలదీశారు. కవ్వంపల్లి ట్వీట్ కు స్పందించిన రసమయి.. హైదరాబాదులో దక్కున్నది, హైదరాబాదు దాటి రానిది నువ్వని, ప్రజల మధ్య ఉంటుంది నేను అని ఫైర్ అయ్యారు. రైతుల తరపున ప్రశ్నించినందుకా దాడి? అని, దాడులకు భయపడే వ్యక్తిని కాదని అన్నారు. అంతేగాక అమాయక కార్యకర్తలను బలిచేయడం ఎందుకు? దమ్ము ధైర్యం ఉంటే నువ్వే రా.. తేల్చుకుందాం అని సవాల్ విసిరారు.
ఇక రసమయి విసిరిన సవాల్ కి ఎమ్మెల్యే కవ్వంపల్లి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రజల మధ్య ఎవరు వున్నారు, ఫాం హౌసులో ఎవరు వున్నారు అనేది ప్రజలకు తెలుసని, గుండారం రైతుల నీళ్లు అక్రమంగా ఫాం హౌసుకు తరలించుకున్న నువ్వా ఈ రోజు రైతుల మీద ప్రేమ నటించేది? అని ఎద్దేవా చేశారు. మాటలతో మాయ చేసే వాళ్ళం కాదు పనులతో అభివృద్ధి చేసేవాళ్ళమని, నువ్వు 10 సంవత్సరాలు అభివృద్ధి మీద దృష్టి పెట్టి వుంటే రైతులకు ఈ అరిగోస తప్పేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ కపట మాటలు ప్రజలు విని, విని విసిగిపోయి నిన్ను ఫాం హౌసులో కూర్చోబెట్టారు, రా రా అని దక్కోవడం కాదు, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి తీరా చూస్తే కనీసం మా కార్యకర్తలకు కూడా సమాధానం చెప్పే ధైర్యం లేక దాక్కున్నావని ఫైర్ అయ్యారు. రంగుల రసమయి.. నీ రంగులన్నీ చూశాం ఇకనైనా బుద్దిగా అభివృద్ధికి సహకరిస్తే మంచిది అని హెచ్చరిస్తున్నామని కవ్వంపల్లి రాసుకొచ్చారు. ఇక దీనిపై రసమయి ఎలా స్పందిస్తారో చూడాలి.