- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Murder: దారుణం.. భర్తని చంపి.. మృతదేహాన్ని ముక్కలు కోసి..

దిశ, నేషనల్ బ్యూరో: ప్రియుడి మోజులో పడిన భార్య.. భర్తను హత్య చేసింది. సినిమా తరహాలోనే భర్తను చంపి.. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కులుగా నరికి ప్లాస్టిక్ డ్రమ్ములో వేశారు. అంతటితో ఆగకుండా దానిపై సిమెంట్ పోసి మూర్తిగా మూసేశారు. ఉత్తరపదేశ్ లోని మీరట్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ లో నేవీ అధికారిని భార్య అతికిరాతంగా కడతేర్చింది. ఈ కేసులో భార్యని, ఆమె ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 4న వ్యక్తి హత్య జరగగా.. దాదాపు 15 రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్చంట్ నేవీలో పనిచేస్తున్న సౌరభ్ రాజ్‌పుత్ మీరట్‌లోని ఇందిరానగర్‌లో తన భార్య ముస్కాన్ రస్తోగి, 5 సంవత్సరాల కుమార్తెతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కాగా ముస్కాన్ తన భర్త స్నేహితుడు సాహిల్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపిస్తోంది. భర్తను అడ్డుతొలగించుకునేందుకు వారిద్దరూ కలిసి సౌరభ్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. ముస్కాన్, సాహిల్ కలిసి సౌరభ్ పై కత్తితో దాడి చేసి చంపేశారు. తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్‌లో వేసి, దుర్వాసన రాకుండా సిమెంట్, నీటితో కలిపిన మిశ్రమంతో నింపారు. హిల్ స్టేషన్ కు తన భర్తలో కలిసి వెళ్తున్నానని పొరుగువారికి చెప్పి ప్రియుడితో కలిసి ముస్కాన్ బయటకు వెళ్లింది. వారి వెంట సౌరభ్ ఫోన్ ని కూడా తీసుకెళ్లారు.
సౌరభ్ కన్పించకపోవడంతో ఫిర్యాదు..
అయితే, చాలా రోజులుగా సౌరభ్ కనిపించకపోవడంతో అనుమానం పెరిగింది. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్కాన్, సాహిల్ ని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారని మీరట్ ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ తెలిపారు. ముస్కాన్ తన నేరాన్ని అంగీకరించి, తన ప్రేమికుడు సాహిల్‌తో కలిసి సౌరభ్‌ను హత్య చేశానని చెప్పింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తనిఖీ చేయగా ప్లాస్టిక్ డ్రమ్ కనిపించింది. అయితే డెడ్ బాడీని కప్పిపెట్టి సిమెంట్ పోయడంతో బిగుసుకుపోయింది. అతికష్టం మీద డ్రమ్ ను కత్తిరించి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపి, నిందితులిద్దరిపై హత్య కేసు నమోదు చేశారు. మరోవైపు సౌరభ్ రాజ్‌పుత్, ముస్కాన్ 2016లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. భార్య కోసం సౌరభ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. మధ్యలో విడాకులు తీసుకుందామనుకున్నా కూతురు గురించి ఆలోచించి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. చివరికి భార్య చేతిలో హతమయ్యాడు.
Read More..