- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL-2025: వైజాగ్‌కు చేరుకున్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2025(IPL 2025) సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌తో పాటు వైజాగ్(Vizag)లోనూ ఐపీఎల్(IPL) మ్యాచులు జరుగబోతున్నాయి. ఈనెల 23వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఉండగా.. మరుసటి రోజు అంటే 24వ తేదీన విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ లక్నో(Lucknow) జట్టు కెప్టెన్ రిషబ్ పంత్(Rishabh Pant) విశాఖ చేరుకున్నారు.
30న విశాఖలో ఢిల్లీ-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనుంది. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం రెండు నెలలు వ్యవధిలోనే విశాఖ క్రికెట్ స్టేడియాన్ని అనేక కొత్త హంగులతో తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు అనేక సౌకర్యాలు కల్పించారు. స్టేడియంలోని 34 గదులను అభివృద్ధి చేయడంతో పాటు, 320 టాయిలెట్లను కూడా ఆధునికీరించామని నిర్వహకులు చెబుతున్నారు. అన్ని ఫ్లడ్ లైట్ల ఏర్పాటుతో పాటు రెండు నెలల కాలంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వారందరికీ ఎంపీ చిన్ని ధన్యవాదాలు తెలియజేశారు.