తెలంగాణ వార్షిక బడ్జెట్‌పై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్ ఇదే

by Mahesh |   ( Updated:2025-03-19 09:23:07.0  )
తెలంగాణ వార్షిక బడ్జెట్‌పై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్ (Annual Budget) పై ఎమ్మెల్సీ కవిత (MLC kavitha) స్పందించారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం అనంతరం.. అసెంబ్లీ మీడియా పాయింట్ (Assembly Media Point) వద్ద ఆమె మాట్లాడుతూ.. ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ అన్నట్లుగా బడ్జెట్ ఉందని అన్నారు. ప్రతి సారి చెప్పినవే చెప్పడం తప్ప అందులో ఒక్క మాట నిజం లేదని గుర్తు చేశారు. అలాగే ఈ సంవత్సరం ప్రభుత్వం కట్టిన అప్పుల గురించి మాట్లాడారు. ఈ సంవత్సరం కేవలం 30 వేల కోట్ల అప్పును మాత్రమే కట్టారని, కానీ సీఎం (CM)మాత్రం లక్ష కోట్లు అప్పులు కడుతున్నామని, అప్పుల కారణంగానే అభివృద్ధి చేయలేకపోతున్నామని అబద్దాలు చెప్పారని గుర్తు చేశారు.

అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల (Debts)పై గతంలో తప్పుడు ప్రచారం చేశారని.. కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పులు చేశారని ప్రజలను తప్పుదోవ పట్టించారని, కానీ బడ్జెట్ బుక్‌లో మాత్రం మొత్తం తెలంగాణ అప్పులను 4 లక్షల 37 వేల కోట్లుగా చూపించారని, ఇందులో లక్షా 58 వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా ఉన్నాయని, దీన్ని బట్టి చూస్తే.. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల (BRS government debts)పై ఏ విధంగా తప్పుడు ప్రచారం (False propaganda) చేశారో ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ((MLC kavitha)) రాష్ట్ర ప్రజలను కోరారు.

Next Story

Most Viewed