Blinkit: ఈఎంఐ సదుపాయం ప్రారంభించిన బ్లింక్ఇట్

by S Gopi |
Blinkit: ఈఎంఐ సదుపాయం ప్రారంభించిన బ్లింక్ఇట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ క్విక్-కామర్స్ కంపెనీ బ్లింక్ఇట్ వినియోగదారుల కోసం కొత్తగా ఈఎంఐ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 2,999 కంటే ఎక్కువ మొత్తం ఆర్డర్లకు ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. దీనికి సంబంధించి బ్లింక్ఇట్ వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా ఎస్క్‌లో ట్వీట్ చేశారు. రూ. 2,999 దాటిన అన్ని రకాల ఆర్డర్లకు ఈఎంఐ ఆప్షన్ వర్తిస్తుందని పోస్ట్ చేశారు. అయితే బంగారం, వెండి నాణెలకు ఇది వర్తించదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో కస్టమర్లకు ఎక్కువ విలువైన కొనుగోళ్లు చేసేందుకు సులభంగా ఉంటుందని తెలిపారు. ఈఎంఐ ఆప్షన్ కోసం కంపెనీ ఎంపిక చేసిన బ్యాంకు క్రెడిట్ కార్డులను ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో పాటు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, యాక్సిస్, ఆర్‌బీఎల్, సిటీ బ్యాంకుల క్రెడిట్ కార్డులతో ఈఎంఐ సదుపాయం వాడుకోవచ్చు. అన్ని బ్యాంకుల కార్డుల ద్వారా 3,6,9 నెలల కాలవ్యవధులలో ఎంచుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు, ఈఎంఐ కాలవ్యవధిని బట్టి వడ్డీ రేటు ఉంటుంది.

Advertisement

Next Story