ఆ కాంట్రాక్టులన్నీ రద్దు...ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

by srinivas |   ( Updated:2024-10-24 16:53:15.0  )
ఆ కాంట్రాక్టులన్నీ రద్దు...ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి అభివృద్ధి(Amaravati Development), రైతు సమస్యల(Farmers Problems)పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన ఇప్పటికే జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశాలపై చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా మంత్రి నారాయణ(Minister Narayana) మాట్లాడుతూ గత సీఎం వైఎస్ జ‌గ‌న్‌(Former CM YS Jagan) వల్ల అమరావతి రైతులు కష్టాలు, తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. రైతు సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పెట్టారని తెలిపారు. 15 రోజుల్లో పాత కాంట్రాక్టులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. డిసెంబ‌ర్ చివ‌రిలోగా అన్ని ప‌నుల‌కు టెండర్లు పిలుస్తామన్నారు. అసెంబ్లీ, హైకోర్టు(Assembly, High Court) నిర్మాణానికి జ‌న‌వ‌రి నెలాఖ‌రుకు టెండ‌ర్ల ప్రక్రియ పూర్తి అవుతుందని పేర్కొన్నారు. దాచేప‌ల్లిలో డ‌యేరియాపై అధికారుల‌తో చ‌ర్చించామని, నీటిని శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed