NEW YEAR: న్యూఇయర్ వేళ రాచకొండ సీపీ కీలక హెచ్చరిక

by Gantepaka Srikanth |
NEW YEAR: న్యూఇయర్ వేళ రాచకొండ సీపీ కీలక హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్(New Year) వేడుకల వేళ రాచకొండ పోలీస్ కమిషనర్(Rachakonda Police Commissioner) కీలక హెచ్చరికలు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. న్యూఇయర్‌ వేడుకలు అందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ వేడుకలు చేసుకోవాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని రాచకొండ సీపీ సుధీర్ బాబు(CP Sudheer Babu) హెచ్చరించారు. ఈ ఏడాది 253 డ్రగ్స్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుల్లో 521 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. మొత్తం రూ.88 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్‌ చేయడంతో పాటు 30 మందికి జీవిత ఖైదు విధించినట్లు స్పష్టం చేశారు. లోక్‌ అధాలత్‌లో 11 వేలకుపైగా కేసులను పరిష్కరించినట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.

Advertisement

Next Story