Whatsapp: యూజర్లకు బిగ్ షాక్.. జనవరి 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిపివేత..!

by Maddikunta Saikiran |
Whatsapp: యూజర్లకు బిగ్ షాక్.. జనవరి 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిపివేత..!
X

దిశ,వెబ్‌డెస్క్: భారతదేశంలో ఇటీవల కాలంలో సైబర్ మోసాలు(Cyber ​​Frauds) పెరిగిపోతున్న విషయం తెలిసిందే. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త అవతారాలెత్తి ప్రజల నుంచి డబ్బును దోచేస్తున్నారు. కొందరు కేటుగాళ్లు ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్(Whatsapp) ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లకు సెక్యూరిటీ(Security) విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జనవరి 1 నుంచి పాత ఫోన్లలో వాట్సాప్ సేవలను(Services) నిలిపివేస్తున్నామని ప్రకటించింది. ముఖ్యంగా 10 ఏళ్ల క్రితం లాంచ్ అయినా ఆండ్రాయిడ్ కిట్ క్యాట్(Android KitKat) ఆపరేటింగ్ సిస్టమ్(OS)తో పని చేస్తున్న ఫోన్లలో తమ సర్వీసులను ఆపివేస్తున్నామని తెలిపింది. ఎవరైనా ఓల్డ్ ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లు వాడుతుంటే కొత్త ఫోన్లకు అప్ గ్రేడ్ అవ్వాలని, ఐఫోన్ యూజర్లకు మే 5 వరకు గడువు ఇస్తున్నామని వెల్లడించింది.

వాట్సాప్ సేవలు నిలిచిపోయే ఫోన్ల లిస్ట్ ఇదే..

  • శాంసంగ్ గెలాక్సీ ఎస్3
  • శాంసంగ్ గెలాక్సీ నోట్2
  • శాంసంగ్ గెలాక్సీ ఎస్4 మినీ
  • మోటో జీ
  • మోటో రేజర్ HD
  • మోటో ఈ 2014
  • LG ఆప్టిమస్ జీ
  • LG నెక్సస్ 4
  • LG జీ2 మినీ
  • LG ఎల్ 90
  • సోనీ ఎక్స్ పీరియా జడ్
  • సోనీ ఎక్స్ పీరియా ఎస్పీ
  • సోనీ ఎక్స్ పీరియా టీ
  • సోనీ ఎక్స్ పీరియా వి
  • HTC 1x
  • HTC 1x+
  • HTC డిజైర్ 500
  • HTC డిజైర్ 601
Advertisement

Next Story

Most Viewed