కాళేశ్వరం నీళ్లు గోదావరి పాలు చేసింది గత ప్రభుత్వం కదా.. : ఎమ్మెల్యే రామచంద్రనాయక్

by Aamani |   ( Updated:2024-03-24 14:58:07.0  )
కాళేశ్వరం నీళ్లు గోదావరి పాలు చేసింది గత ప్రభుత్వం కదా.. : ఎమ్మెల్యే రామచంద్రనాయక్
X

దిశ,వంగర:కాళేశ్వరంనీళ్లు గోదావరి పాలు చేసింది గత ప్రభుత్వం కదా అని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ గత కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం మండలంలోని ఆర్కే తండా పరిధిలోని సర్పంచ్ తండాలో ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ లోని కొన్ని పిల్లర్లు ఇప్పటికే కుంగిపోయాయని.. ఆ బ్యారేజీ మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోనే భాగమైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ప్రమాదంలోనే ఉన్నాయని పేర్కొన్నారు.

ఇంత జరిగిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ లక్షల కోట్లు దోచుకుని కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. గోదావరిలో 2 టీఎంసీల నీటి కోసం లక్షల కోట్లు వృధా చేశారని నిప్పులు చెరిగారు. పాలకుర్తిలో పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా పని చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిందేమిలేదని, స్థానికుడైన మాజీ ఎమ్యెల్యే డాక్టర్ సుధాకర్ రావును వెన్నుపోటు పొడిచి తన రాజకీయ జీవితాన్ని ఆగం చేశాడన్నారు. పాలకుర్తి ఎమ్యెల్యే యశస్వినీ రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తిలో ఎర్రబెల్లి అభివృద్ధి చేసిందేమిలేదని, ఓడిపోయినా ప్రెస్టేషన్ లో ఏదేదో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే అయిదు గ్యారెంటీలను అమలు చేసిందన్నారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలు గెలువబోతున్నామని, కార్యకర్తలు సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి, మాజీ పీసీసీ సభ్యులు నిరంజన్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కాకి రాల హరి ప్రసాద్, రాష్ట్ర నాయకులు నెహ్రూ నాయక్, సైదులు, హరికృష్ణ, రాజు యాదవ్, జగ్గా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed