- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుబంధు ఆపాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది : గండ్ర
దిశ,భూపాలపల్లి : రైతుబంధు ఆపాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది..అలాగే మోటర్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ పార్టీ అంటుంది. విజ్ఞులైన వారు ప్రజలకు,కార్యకర్తలకు వివరించాలని భూపాలపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని వివిధ గ్రామాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా భూపాలపల్లి నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ బసవరాజు సారయ్య తో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టో లోని ప్రతి పథకాలను ప్రతి ఓటరుకు చేరేలా ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు తెలంగాణ రాకముందు కరెంట్ ఎలా ఉందో తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ ఎలా ఉందో రైతులు ఆలోచించాలన్నారు కార్యకర్తలకు సరిగ్గా 30 రోజుల సమయం ఉందని ఈ 30 రోజులు ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లాగా పని చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే అది టిఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమైందని సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలను అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.