- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భద్రకాళి ఆలయానికి బోగ్ సర్టిఫికెట్ అందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి...
దిశ, వరంగల్ :వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానానికి నేడు ఉదయం హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్ లో తెలంగాణా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి శేషుభారతికి ఈట్ రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ సర్టిఫికెట్ (బోగ్)ను అందజేశారు. ఈ సందర్భంగా శేషు భారతి మాట్లాడుతూ… ఈ సర్టిఫికెట్ ను వివిధ రకాలైన తనిఖీలు, ఆడిట్లు నిర్వహించిన తర్వాత శిక్షణ పొందిన సిబ్బందికి, నాణ్యత ప్రమాణాలతో ఉన్న ముడి సరుకులను వినియోగించిన వారికి, ప్రసాదాలు తయారు చేయు ప్రదేశంలో పరిశుభ్రత పాటించిన వారికి, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత ఇటువంటి ప్రమాణాలు పాటించిన వారికి మాత్రమే భారత ప్రభుత్వ ఆహార పరిరక్షణ ప్రమాణాల అధికారిక సంస్థచే ఈట్ రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ సర్టిఫికెట్ (బోర్డ్)ను అందజేస్తారని, 2024 ఫిబ్రవరి నెలలోనే భద్రకాళి దేవస్థానానికి జారీ చేశారని, ఈ సర్టిఫికెట్ ను మంగళవారం మంత్రి చేతుల మీదుగా ప్రదానం చేశారని శేషు భారతి తెలిపారు.