- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మిషన్ భగీరథ నీటిలో చేప పిల్లలు..ఆ నీటిని తాగేదెలా..?
దిశ,తొర్రూరు: ఎక్కడైనా నల్లాల నుంచి నీళ్లు వస్తాయి. కానీ తొర్రూరు ఓ కాలనీలో నల్లాల నుంచి చేప పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. నమ్మశక్యంగా లేకున్నా ఇదే నిజం.. తొర్రూరు మున్సిపాలిటీలో 7వ వార్డులో ఉదయం మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అయ్యాయి. ఆ వార్డులో కొంతమంది మహిళలు మిషన్ భగీరథ నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన మహిళలకు బిందెలో చేప పిల్లలు ప్రతేక్షమవ్వగా,మహిళలు ఆశ్చర్యపోయారు.గమనించిన మహిళలు ఈ నీళ్లు తాగుతే రోగాల బారిన పడుతమని అక్కడి నుండి వెళ్ళిపోయారు.కొద్ది సేపటికి బంది విజయ అనే మహిళ మంచి నీరు పట్టుకోవడానికి నల్ల దగ్గరకు వెళ్లి నీళ్లు పట్టుకుంటుండగా నీళ్లలో చేప పిల్లలు రావడం తో మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు.
అంతే కాకుండా నీళ్ల నుంచి దుర్వాసన కూడా వస్తుందని వారు ఆరోపిస్తున్నారు. స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న,ప్రజాప్రతినిధులు, అధికారులు నీళ్లలో చేపలు రావడం, దుర్వాసన రావడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఫిల్టర్ హౌస్‌లో ఫిల్టర్ కాకుండానే నీటిని వదులుతున్నట్లుగా చేప పిల్లలు ప్రత్యక్షంగా బట్టబయలైంది పలువురు ఆరోపిస్తున్నారు.
సంక్షేమ హాస్టల్లో భగీరథ నీళ్లు..
మండల కేంద్రంలో సంక్షేమ హాస్టల్ లో త్రాగడానికి మంచి నీళ్ళు,భగీరథ నీళ్లు వడుతున్నమని,అవి చాలా దుర్వాసనతో కూడిన నీళ్లు వస్తున్నాయని హాస్టల్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.భగీరథ నీళ్లు తాగితే మాకు విరేచనాలు,మరియు జ్వరాలు వస్తున్నాయని విద్రతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మంచినీటి సరఫరా అందించే విధంగా ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.