- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ విలేకరుల ముసుగులో మరో దందా.!
దిశ, మరిపెడ (కురవి) : కురవి మండల కేంద్రంలోని లాడ్జిల వ్యవహారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా అలా ముందుకు సాగుతుంది. గత 5 రోజుల క్రితం టాస్క్ఫోర్స్ దాడుల్లో పట్టుబడ్డ జంటలు, ఓనర్ పైన కేసునమోదైన విషయం ప్రజలకు విధితమే. అయినా మరి కొంత మంది లాడ్జీ ఓనర్లు యధావిధిగా ఈ వ్యవహారంను మళ్లీ నడిపిస్తున్నట్టు గంటకు వెయ్యి రూపాయల పైన ఇప్పుడు వసూలు చేస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ కేసుల వల్ల అయ్యేదేముంది పోయేదేముంది అంటూ ఎవరికి ముట్ట చెప్పే పైకం వారికి ముట్టజెప్పుతో మన పని మనం చేసుకుంటూ ముందుకు పోదాం అంటూ ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారట. లాడ్జిల నుంచి ఆ కార్యాలయానికి నెలవారి మాముళ్లు 60 వేల రూపాయలు. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రలపైన మండలవాసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారి సీజన్ ని బట్టి నెలకు 5వేల నుంచి 10 వేల రూపాయలు మాముళ్లు ఇస్తున్నరాని ఇలా అయితే ఈ వ్యవహారనికి ఇప్పుడప్పుడే బ్రేక్ పడదని గతంలో వారు ఆరోపించినట్టుగానే మళ్లీ ఇదే తంతు నడుస్తుందని గతాన్ని వారు గుర్తు చేసుకున్నారు.
నకిలీ విలేకరుల ముసుగులో మరో దందా.!
ఇప్పటి వరకు అధికారుల వ్యవహారం పైన పెదవి విరిసిన ప్రజలు నకిలీ విలేకరుల వ్యవహారాన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. వివిధ వర్గాల వారు తెలియజేసిన సమాచారం ప్రకారం ఈ వ్యవహారం మళ్లీ పబ్లిసిటీ కాకుండా వార్తల్లోకి రాకుండా కొంతమంది లాడ్జి ఓనర్లతో సంప్రదింపులు జరుపుకొని బడా వ్యవహారం నడిపే నకిలీ విలేకరులకు ఒకరికి 30 వేల రూపాయలు మరి కొంతమందికి పదివేల రూపాయల చొప్పున పైకం ఒప్పందం జరిగినట్టు మండలంలో గుసగుసలు వినపడుతున్నాయి.