బియ్యం బస్తాలతో వెళ్తున్న లారీ బోల్తా

by Kalyani |
బియ్యం బస్తాలతో వెళ్తున్న లారీ బోల్తా
X

దిశ, కొత్తగూడ : బియ్యం బస్తాలతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లో చోటుచేసుకుంది. గంగారం ఎస్సై రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… జగిత్యాల జిల్లా నుండి భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట వెళ్తున్న బియ్యం లోడు లారీ గంగారం మండలం తిర్మలగండి సమీపంలో బోల్తా కొట్టింది. ఖమ్మం జిల్లా వెళ్తున్న మార్గంలో కొత్తగూడ నుండి గంగారం మధ్యలో ఇరుకైన రోడ్డు ఉండటంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని సైడ్ ఇచ్చే క్రమంలో బోల్తా కొట్టిందని తృటిలో ప్రమాదం తప్పిందని తెలిపారు. కానీ లారీకి ఒకటే నెంబర్ ప్లేట్ మీద రెండు నెంబర్ లు ఉండడంతో బియ్యం లోడుతో వెళ్తున్న లారీ ప్రభుత్వ బియ్యమా లేక అక్రమ రేషన్ బియ్యమా అనే విషయం పై అనుమానాలు తలెత్తుతున్నాయి. వివరాలు సేకరిస్తున్నమని గంగారం ఎస్సై రవికుమార్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed