- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
VH: బతుకమ్మ ఆడిన కవిత ఏనాడు ఆ ప్రయత్నం చేయలే.. వీహెచ్ విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలే గతంలో ఇందిరమ్మ పేదలకు పంచిన స్థలాలను అమ్ముకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. చెరువులను సైతం వదలలేదని బీఆర్ఎస్ నేతలు ఇకనైనా తక్కువ మాట్లాడితే బెటర్ అని సూచించారు. మంగళవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన అంబర్ పేట పరిధిలోని బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉండగా బీఆర్ఎస్ నేతలే ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడుతుంటే వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. ప్రతియేటా బతుకమ్మ ఆడిన కవిత ఏనాడుకూడా బతుకమ్మ కుంటను కాపాడే ప్రయత్నం చేయలేదని, కానీ ఇవాళ మా ప్రభుత్వం అధికారంలో ఉందని మేము కాపాడుతామన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మానుకుని కళ్లుతెరిచి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు అడ్వకేట్ జనరల్ ప్రయత్నం చేయాలన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదట బతుకమ్మకుంట చెరువు కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.