- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై మాజీ పీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఉత్తమ్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని అన్నారు. త్వరలోనే కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలంతా హైదరాబాద్ వదిలి.. నియోజకవర్గాలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. తనతోపాటు కాంగ్రెస్ నేతలంతా ఎవరెక్కడ పోటీ చేయాలన్నది పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయిస్తారని తెలిపారు. అంతేగాక, గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడాన్ని ఉత్తమ్ తప్పు బట్టారు. కేసీఆర్ అహంకార ధోరణి కారణంగానే గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ తీరును తాను ఖండిస్తున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాజ్యాంగ సంప్రదాయాలను తుంగలో తొక్కడం సరైంది కాదన్నారు.