- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Election Commission: ఈ ఎన్నికల్లో రూ. 1000 కోట్ల నగదు పట్టివేత
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర(Maharashtra), జార్ఖండ్ ఎన్నికల(Jharkhand Elections) రాష్ట్రాలతోపాటు 14 రాష్ట్రాల్లో జరుగుతున్న ఉపఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్(Election Commission) అధికారులు సుమారు రూ. 1000 కోట్లు సీజ్ చేశారు. లిక్కర్, ఇతర వస్తువులతోపాటు రూ. 1,082.2 కోట్లను పట్టుకున్నారు. ఐదేళ్ల క్రితంనాటి గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి సీజ్ చేసిన డబ్బు కనీసం ఏడు రెట్లు పెరగడం గమనార్హం. మహారాష్ట్రలో రూ. 5.20 కోట్ల విలువైన వెండి కడ్డీలు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్‌లో రూ. 21.26 కోట్ల విలువైన సహజ వనరుల అక్రమ మైనింగ్ జరిగినట్టు తెలిసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు సీజ్ చేసిన నగదు వివరాలను అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోనే రూ. 660.18 కోట్ల నగదు పట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలో రూ. 103.61 కోట్లు సీజ్ అయ్యాయి. జార్ఖండ్ విషయానికి వస్తే తాజాగా 198.12 కోట్లు ఈ ఎన్నికల సందర్భంగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మొత్తం 18.76 కోట్లు పట్టుకున్నారు.