- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Srishailam : కార్తీక సోమవారం ఎఫెక్ట్.. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం(Srishailam) దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం సందర్భంగా భ్రమరాంభ మల్లిఖార్జునస్వామిలను దర్శించుకోడానికి భారీగా భక్తులు తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో శ్రీశైల ఆలయ పరిసరాలు.. భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామి నామస్మరణలతో మార్మోగాయి. వేకువ జాము నుంచే భక్తులు పాతాళ గంగలో(Krishna River)లో స్నానాలు ఆచరించారు. కృష్ణమ్మకు పసుపు, కుంకుమలతో సారె సమర్పించి.. కార్తీక దీపాలను వదిలారు. అక్కడి నుంచి ఆలయానికి చేరుకొని స్వామి, అమ్మవారలను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఉత్తరమాడవీధిలో, గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగించారు.
Advertisement
Next Story