Meta Platforms: మెటా ప్లాట్‌ఫామ్‌పై రూ. 213 కోట్ల పెనాల్టీ విధించిన సీసీఐ

by S Gopi |
Meta Platforms: మెటా ప్లాట్‌ఫామ్‌పై రూ. 213 కోట్ల పెనాల్టీ విధించిన సీసీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: వాట్సాప్ ప్రైవసీ పాలసీ ద్వారా మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిన కారణంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మెటా ప్లాట్‌ఫామ్‌పై రూ. 213.14 కోట్ల భారీ జరిమానా విధించింది. పాలసీ విధానాన్ని ఉపయోగించి వినియోగదారుల డేటాను సేకరించి, ఇతర మెటా కంపెనీలతో షేర్ చేసుకోవడంపై సీసీఐ పెనాల్టీ వేసింది. జరిమానాతో పాటు సీసీఐ చెప్పిన సమయంలోగా నిర్దిష్ట నియమాలను అమలు చేయాలని మెటా, వాట్సాప్‌లను కోరుతూ ఆదేశాలను జారీ చేసింది. ఐదేళ్ల వరకు ప్రకటనల ప్రయోజనాల కోసం మెటా కంపెనీలతో యూజర్ డేటాను పంచుకోవడం నిలిపివేయాలని సీసీఐ వాట్సాప్‌ను ఆదేశించింది. దేశీయంగా 50 కోట్ల వరకు కస్టమర్లకు కలిగి ఉన్న వాట్సాప్‌కు సీసీఐ నిర్ణయం గట్టి ఎదురుదెబ్బ కానుంది.

Advertisement

Next Story

Most Viewed