- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GSAT 20 : అమెరికాలో ఇస్రో ‘జీశాట్-20’ ప్రయోగం సక్సెస్
దిశ, నేషనల్ బ్యూరో : ‘ఇస్రో’(Isro) అభివృద్ధి చేసిన అత్యాధునిక కమ్యూనికేషన్ శాటిలైట్ ‘జీశాట్ -20’(GSAT 20)ని అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న కేప్ కెనవెరల్ నుంచి సోమవారం అర్ధరాత్రి విజయవంతంగా ప్రయోగించారు. స్పేస్ ఎక్స్(SpaceX) కంపెనీకి చెందిన ఫాల్కన్ -9 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఇది 4,700 కేజీల బరువైన ఇస్రో శాటిలైట్ ‘జీశాట్ -20’ని తనతో పాటు తీసుకెళ్లింది. ఫాల్కన్ -9 రాకెట్ నిర్దిష్ట ఎత్తుకు చేరిన తర్వాత ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.
ఈ ఉపగ్రహం 14 ఏళ్లపాటు యాక్టివ్‌గా పనిచేస్తూ భారత్‌కు సంబంధించిన వివిధ రకాల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చనుంది. జీశాట్-20 తన పనిని మొదలుపెట్టాక.. భారతదేశ గగనతలం మీదుగా ప్రయాణించే విమానాల్లోని ప్రయాణికులకు కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలను ఇంటర్నెట్‌తో అనుసంధానించేందుకు ఈ ఉపగ్రహం బాటలు వేయనుంది. ఇస్రో వద్దనున్న రాకెట్లు గరిష్ఠంగా 4,100 కేజీల శాటిలైట్లను మాత్రమే మోసుకెళ్లగలవు. అందుకే దాదాపు రూ.500 కోట్లు విలువ చేసే కాంట్రాక్టును అపర కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk)కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీకి అప్పగించి, శక్తివంతమైన ఫాల్కన్-9 రాకెట్‌తో ఈ ప్రయోగాన్ని చేయించారు.