- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
PKL 2024 : అదరగొట్టిన తెలుగు టైటాన్స్.. హర్యానాకు షాక్
దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌లో గత మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్న తెలుగు టైటాన్స్ తిరిగి పుంజుకుంది. వరుస విజయాలతో దూకుడు మీద హర్యానా స్టీలర్స్‌కు షాకిచ్చి గెలుపు బాట పట్టింది. సోమవారం నోయిడా వేదికగా జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 49-27 తేడాతో భారీ విజయం సాధించింది. భీకర ఫామ్‌లో ఉన్న స్టార్ ప్లేయర్, కెప్టెన్ పవన్ సెహ్రావత్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అయినప్పటికీ టైటాన్స్ జట్టు అదరగొట్టింది. హర్యానాపై మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థిని ఫస్టాఫ్‌లోనే రెండుసార్లు ఆలౌట్ చేసింది. దీంతో టైటాన్స్ ఫస్టాఫ్‌లోనే 24-11తో ఆధిక్యంలో నిలిచి పట్టు సాధించింది.
సెకండాఫ్‌లోనూ టైటాన్స్ ప్లేయర్లు అదే దూకుడు కొనసాగించారు.హర్యానా ఆటగాళ్లు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. తెలుగు టైటాన్స్ సెకండాఫ్‌లోనూ రెండుసార్లు హర్యానాను ఆలౌట్ చేసింది. దీంతో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో టైటాన్స్ 22 పాయింట్ల తేడాతో గెలుపొందింది. రైండర్ ఆశిష్ నర్వాల్ 11 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. విజయ్ మాలిక్ 8 పాయింట్లతో రాణించాడు. ఓటమిపాలైప్పటికీ హర్యానా పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. టైటాన్స్ 7వ స్థానంలో ఉన్నది.
మరోవైపు, చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ను 37-38 తేడాతో యు ముంబా ఓడించింది. యు ముంబాకు ఇది వరుసగా రెండో విజయం కాగా.. బెంగళూరుకు వరుసగా నాలుగో ఓటమి. ఇరు జట్ల ఆటగాళ్లు పాయింట్లు కోసం నువ్వానేనా అని తలపడటంతో ఆధిక్యం మారుతూ వచ్చింది. దీంతో ఆఖరి వరకు ఊగిసలాడిన విజయం చివరకు ఒక్క పాయింట్ తేడాతో యు ముంబానే వరించింది.అజిత్(10 పాయింట్లు), మన్‌జీత్(పాయింట్లు) ముంబా విజయంలో కీలక పాత్ర పోషించారు.